.పార్వతీపురం.మన్యం.జిల్లాలో ఇంచార్జి మంత్రి .అచ్చెన్నాయుడు పర్యటించారు
అమరావతి, 6 అక్టోబర్ (హి.స.) కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఇన్‌ఛార్జ్‌ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. కురుపాం గిరిజన పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై వైద్య, గిరిజన, సంక్షేమ శాఖ, ఇంజినీరింగ
.పార్వతీపురం.మన్యం.జిల్లాలో ఇంచార్జి మంత్రి .అచ్చెన్నాయుడు పర్యటించారు


అమరావతి, 6 అక్టోబర్ (హి.స.)

కురుపాం: పార్వతీపురం మన్యం జిల్లాలో ఇన్‌ఛార్జ్‌ మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. కురుపాం గిరిజన పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ ఘటనపై వైద్య, గిరిజన, సంక్షేమ శాఖ, ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్ష చేపట్టారు. బాలికల అస్వస్థతకు సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ఘటనను సీఎం పర్యవేక్షిస్తున్నారని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విశాఖపట్నం కేజీహెచ్, పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande