భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
తెలంగాణ, నిజామాబాద్. 6 అక్టోబర్ (హి.స.) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరి
నిజామాబాద్ కలెక్టర్


తెలంగాణ, నిజామాబాద్. 6 అక్టోబర్ (హి.స.)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. సోమవారం ఆయన వర్ని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు.? ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి? ఎంత మందికి నోటీసులు ఇచ్చారు? క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande