తెలంగాణ, ఆసిఫాబాద్. 6 అక్టోబర్ (హి.స.)
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో వరుసగా జరుగుతున్న దొంగతనాల కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ వివరాలను కాగజ్ నగర్ డీఎస్పీ సోమవారం వహీదుద్దీన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఓల్డ్ కాలనీకి చెందిన గాలోత్ కుషాల్ (20), ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓర్సు అనిల్ (16), ఎంపీ కి చెందిన జై కుమార్ అనే ముగ్గురు కలిసి పలు గృహ దొంగతనాలకు పాల్పడ్డారు. కుషాల్ స్కావెంజర్గా పనిచేస్తూ జూదానికి బానిసై, ఆదాయం సరిపోక దొంగతనాలకు ఒడిగట్టినట్లు తెలిపారు.
పగటిపూట తాళం వేసి ఉన్న ఇండ్లను గుర్తించి, రాత్రివేళ ప్లాన్ ప్రకారం దాడి చేసేవారని, కుషాల్, జై కుమార్ కాపలా కాస్తుండగా అనిల్ ఇంట్లోకి చొరబడి నగదు, నగలు దోచుకునేవాడని విచారణలో తేలింది ఈ ముఠా పట్టణంలో ఐదు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుండి 213 గ్రాముల బంగారు నగలు, సుమారు ₹1.13 లక్షల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు