విశాఖపట్నం 6 అక్టోబర్ (హి.స.)
:ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌సీఐ) యాజమాన్యం కిందకు వచ్చిన వీఎల్‌జీసీ(శివాలిక్) నౌక తొలిసారిగా దేశంలోని విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. శివాలిక్ నౌకకు సర్బానంద సోనోవాల్ విశాఖ సముద్రంలో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ