తెలంగాణ, సిద్దిపేట. 6 అక్టోబర్ (హి.స.)
ఆసుపత్రికి వచ్చే రోగులకు ఓపికగా
మెరుగైన వైద్యసేవలు అందించాలి అని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ల్యాబ్ లో పరీక్షల వివరాలను ఆరా తీశారు, స్టాక్ రిజిస్టర్ చెక్ చేశారు. రాపిడ్ టెస్టులు తప్పనిసరి చెయ్యాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రెగ్నెన్సీ మహిళలకు హెచ్ఐవీ, సిపిలిస్ పరీక్షలు చెయ్యాలి అని రోజువారి టెస్టుల వివరాలు స్టాక్ వివరాలు రిజిస్టర్ లో పొందుపర్చాలి. మెడికల్ స్టోర్ లో మందులు పరీక్షిస్తూ కాలం చెల్లిన మందులు వాడకూడదని టెస్టులకు సంబంధించి అన్ని పరికరాలు పీహెచ్సీలో ఉంచుకోవాలని మెడికల్ ఆఫీసర్ ను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు