తెలంగాణ సర్కార్కు భారీ ఊరట.. BC రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్టు
హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్రెడ్డి ఇటీవలే సుప్రీంకో
సుప్రీం కోర్ట్


హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42

శాతం రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం. 9ని సవాలు చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన వంగా గోపాల్రెడ్డి ఇటీవలే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తులు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గోపాల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించారు. ఓ వైపు తెలంగాణ హైకోర్టులో కేసు విచారణలో ఉండగా ఇక్కడకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించిందని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలుపగా.. అక్కడ స్టే ఇవ్వకపోతే ఇక్కడకు వస్తారా..? అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ వంగా గోపాల్ రెడ్డి తరఫు లాయర్కు సుప్రీం కోర్టు సూచించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande