హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
ట్విన్ సిటీస్ పరిధిలో బస్సు చార్జీలను పెంచుతున్నట్లుగా ఇప్పటికే టీజీ ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పెంచిన బస్సు చార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చేశాయి. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 పెంచారు. దీంతో ఆర్టీసీకి రోజుకు సుమారు రూ24 కోట్ల ఆదనపు ఆదాయం సమకూరనుంది. ఆర్డినరీ బస్సులో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండగా.. గరిష్టంగా రూ.50లగా ఉంది. మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండగా.. గరిష్టంగా రూ.60గా ఉంది. ఈ-మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్లో కనిష్టంగా రూ.15 చార్జీ ఉండా.. గరిష్టంగా రూ.70గా ఉంది. ఈ-మెట్రో ఎసీ బస్సుల్లో కనిష్టంగా రూ.20 చార్జీ ఉండగా.. గరిష్ట చార్జీ రూ.90కి చేరింది. జంట నగరాల్లో 2,931 బస్సులు ఉండగా.. రోజుకు 31,815 టిప్పులు నడుస్తున్నాయి. మొత్తం 26 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో 70 శాతం అంటే18 లక్షల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అన్ని రకాల బస్సు పాస్ వినియోగదారులు 2.7 లక్షల మంది ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు