హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
అక్టోబర్ 10 నుంచి 12 వరకు
తెలంగాణ ప్రాపర్టీ షో 15వ ఎడిషన్ నరేడ్కో హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనున్నట్లు సోమవారం బంజారాహిల్స్ లోని హయత్ ప్లేస్ హోటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు వెల్లడించారు.
ఈ ప్రాపర్టీ షో వివిధ రకాల కస్టమర్ల అవసరాలను తీర్చడానికి నివాస, కార్యాలయ వాణిజ్య, రిటైల్ వాణిజ్యంతో సహా ఆస్తులను ప్రదర్శిస్తుంది అని నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలో అత్యంత డైనమిక్, వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ కొనసాగుతోంది. 2025లో, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రగతిశీల విధానాలు, స్థిరమైన సంస్కరణల కారణంగా నగరం ఐటీ, ఐటీఈఎస్, ఫార్మా, ఏరోస్పేస్, ఏవియేషన్, ఆటో మొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో స్థిరమైన భాగస్వామ్యం వహిస్తోందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు