హైదరాబాద్, 6 అక్టోబర్ (హి.స.)
విజయవాడ హైదరాబాద్ జాతీయ
రహదారిపై సోమవారం కూడా భారీగా రద్దీ కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయదశమికి సొంత ఊర్లకు వెళ్లినవారు ఆదివారం నుంచి హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు. దీంతో చౌటుప్పల్ లోని జాతీయ రహదారిపై రెండు రోజులుగా వాహనాల రద్దీ కొనసాగుతుంది. అంతేకాకుండా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో సర్వీస్ రోడ్డు వెంట రహదారి పనులు కొనసాగుతుండడం కూడా ఈ రద్దీకి పెరగడానికి మరో కారణం అయింది. విజయదశమి, సంక్రాంతి పండుగలకు ప్రతి ఏటా చౌటుప్పల్ జాతీయ రహదారిపై ఈ విధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..