మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
తెలంగాణ, 6 అక్టోబర్ (హి.స.) మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే, కానీ బీఆర్ఎస్ చేసిన అప్పుల మాట ఏంటి అని ఫైర్ అయ్యారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్
ఎమ్మెల్యే నాయిని


తెలంగాణ, 6 అక్టోబర్ (హి.స.)

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే, కానీ బీఆర్ఎస్ చేసిన అప్పుల మాట ఏంటి అని ఫైర్ అయ్యారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.

పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య, వర్ధన్నపేట శాసన సభ్యులు కే ఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన బీఆర్ఎస్ కా డోఖా పేరుతో కార్డులను విడుదల చేశారు.

అనంతరం నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆరెస్ హయాంలో ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని ఆగ్రహించారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande