అనకాపల్లి, 7 అక్టోబర్ (హి.స.)
విశాఖపట్నం నుంచి మాకవరపాలెం వరకూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ( ప్రకటించారు. మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడానికి ఈ నెల 9వ తేదీన జగన్ రానున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మంగళవారం) అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ