హైదరాబాదు నగరంలోని ఫిలిం నగర్ పీ ఎస్ పరిదిలో భారీ చోరీ
హైదరాబాద్‌ 7 అక్టోబర్ (హి.స.): నగరంలోని ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయూ కాలనీలో నివసిస్తున్న స్వప్న ఇంట్లో ఈ దొంగతనం జరిగింది.
హైదరాబాదు నగరంలోని ఫిలిం నగర్ పీ ఎస్ పరిదిలో భారీ చోరీ


హైదరాబాద్‌ 7 అక్టోబర్ (హి.స.): నగరంలోని ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 43 తులాల బంగారం, రూ.లక్ష నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓయూ కాలనీలో నివసిస్తున్న స్వప్న ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. ఇటీవల ఆమె భర్త చనిపోయారు. గత నెల 27న అత్తవారింటికి వెళ్లి ఈనెల 5న తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి బంగారం, నగదు చోరీ అయినట్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande