హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)
హైదరాబాద్ నగరంలో నడిపే ఆర్టీసీ
బస్సు ఛార్జీలు పెంచుతున్నట్లు రెండు రోజుల క్రితం ఆర్టీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. రోజుకు కోటి రూపాయల అదనపు ఆదాయమే లక్ష్యంగా చేసుకుని రూ.5, రూ.10 ఛార్జీలను పెంచడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు ఫ్రీ బస్సు పథకం కొనసాగిస్తునే.. పురుషుల వద్ద డబుల్ ఛార్జీలు వసూల్ చేస్తున్నారని ప్రభుత్వం, ఆర్టీసీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆర్టీసీ సిటీ బస్సు చార్జీల పెంపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మహిళలకు ఉచితంగా ఇచ్చినట్లే ఇచ్చి, పురుషుల దగ్గర చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన బస్సు చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి అసెంబ్లీ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఇతర నేతలు తమ నిరసన తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..