తెలంగాణ, ఆదిలాబాద్. 7 అక్టోబర్ (హి.స.)
జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాడుతూ ప్రాణాలు వదిలిన ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం 85వ వర్ధంతి సందర్బంగా నేరడిగొండ మండల కేంద్రంలో మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కొమురం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసీ ఆరాధ్య దైవం కొమురం భీం జ్ఞాపకార్థం ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్ లో గత ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 25 కోట్లతో మ్యూజియం నిర్మించారని గుర్తుచేశారు. మావ నాటే మావ రాజ్ కళనుసాకారం చేసి వారి గ్రామాల్లో వారికే అధికారం ఇచ్చిన ఘనత కేసీఆర్ దని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు