హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నడుమ బొంతు రామ్మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో తాను లేనని స్పష్టం చేశారు. టికెట్ కోసం ఎవరిని అడలేదని తెలిపారు. అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అభ్యర్థి ఎవరైనా సరే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని వెల్లడించారు.
కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్లు జూబ్లీహిల్స్ సీటు ఆశిస్తున్నారని ప్రచారం ఉంది. వీరిలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ సర్కార్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరిని త్వరలోనే ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో బొంతు రామ్మోహన్ తాను అభ్యర్థి రేసులో లేనని చెప్పడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..