తిరుపతి, 7 అక్టోబర్ (హి.స.)
, తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు (మంగళవారం) సాయంత్రం 7 గంటలకు సమావేశంకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పట్ల అనుసరించాల్సిన విధానంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కూటమి అభ్యర్థి విజయానికి నేతలు కృషి చేయాలని వారికి దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యమంత్రి. నారావారిపల్లె నుంచి చంద్రబాబు వచ్చిన వెంటనే తెలంగాణ నేతలతో ఉండ వల్లి నివాసంలో.సమావేశం కానున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ