తెలంగాణ, సిద్దిపేట. 7 అక్టోబర్ (హి.స.)
ప్రపంచం ఉన్నంత వరకు శాఖ వారి రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే హైమావతి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో కలెక్టర్ హైమావతి పాల్గొని వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి ఇతిహాసాల్లో మొదటిది రామాయణం రచించారన్నారు. కార్యక్రమంలో జడ్పీసీఈఓ రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి సయ్యద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు