దసరా ఉత్సవాల్లో శ్రీ. దుర్గామల్లేశ్వర స్వామి తొలి విడత ఆదాయం 3.57 కోట్లు
ఇంద్రకీలాద్రి, 7 అక్టోబర్ (హి.స.) దసరా ఉత్సవాల్లో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపంలో తొలివిడతగా సోమవారం లెక్కించారు. 50 హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3,57,92,708
దసరా ఉత్సవాల్లో శ్రీ. దుర్గామల్లేశ్వర స్వామి తొలి విడత ఆదాయం 3.57 కోట్లు


ఇంద్రకీలాద్రి, 7 అక్టోబర్ (హి.స.)

దసరా ఉత్సవాల్లో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను మల్లికార్జున మహా మండపంలో తొలివిడతగా సోమవారం లెక్కించారు. 50 హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.3,57,92,708 ఆదాయం వచ్చింది. 122 గ్రాముల బంగారం, 9.700 కిలోల వెండి వస్తువులను భక్తులు మొక్కుల రూపంలో చెల్లించారు. అమెరికా డాలర్లు 52, సింగపూర్‌ డాలర్లు 55, కెనడా డాలర్లు 5, సౌదీ రియాల్స్‌ 3, కువైట్‌ దీనార్లు 7 వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. కానుకల లెక్కింపును దేవస్థానం ఈవో శీనా నాయక్, ట్రస్టుబోర్డు ఛైర్మన్‌గా నియమితులైన బొర్ర రాధాకృష్ణ(గాంధీ) పర్యవేక్షించారు. మరో రెండు విడతలుగా హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించాల్సి ఉందని ఈవో తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande