అమరావతి, 7 అక్టోబర్ (హి.స.)
: ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కుల కోసం ఫ్యాప్టో పిలుపు ఇచ్చింది.. ఇవాళ ఉదయం 10 గంటలకు ధర్నాచౌక్ లో FAPTO పోరుబాట నిరసన ధర్నా చేపట్టనుంది.. రాష్ట్రంలోని ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ధర్నాకు సిద్ధం అయ్యారు ఉపాధ్యాయులు.. విజయవాడ ధర్నా చౌక్ కు వేలాది మంది ఉపాధ్యాయులు తరలిరానున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు పూర్తయినా ఏ ఒక్క హామీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని టీచర్లు విమర్శిస్తున్నారు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ