హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)
ఆదాయపన్ను శాఖ అధికారులు మరోసారి నగరంలో సోదాలు చేపట్టారు. కొండాపూర్, కూకట్ పల్లి ప్రాంతాలలో ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఖానామెట్ లోని అపర్ణ ఆర్చిడ్స్ విల్లాస్ లో ఉంటున్న వెంకట్ రెడ్డి అనే వ్యక్తి నివాసంలో ఈ ఉదయం నుండి ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. వెంకట్ రెడ్డి నగరంలో హోల్ సేల్ పప్పుదినుసుల వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తుంది.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం పది చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల్లో కూడా పప్పు దినుసుల హోల్సేల్ వ్యాపారుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలకు సంబంధించిన పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..