కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలై నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. ద
క్రిమినల్ కేసు


హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలై నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావిస్తూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవై పై బీఎన్ఎస్ యాక్ట్లని సెక్షన్ 170,171,174 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande