హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)
సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణ
సందర్భంగా.. CJI గవాయ్ పై 71 ఏళ్ల లాయర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో.. పాటు హాట్ టాపిక్ గా మారింది. ఈ అనూహ్య ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఎక్స్ వేదికగా స్పందించారు.
దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్లో :మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుంది. నిన్న సుప్రీం కోర్టులో CJI గవాయ్ పై దాడి జరిగినప్పుడు దీనికి ఒక దారుణమైన సంకేతంగా కనిపించింది. ప్రధాన న్యాయమూర్తి B.R. గవాయ్ పై జరిగిన దాడిని తీవ్రంగా, ఖండిస్తున్నాను. న్యాయ గౌరవంపై జరిగిన ఈ అవమానకరమైన దాడి కేవలం ఒక వ్యక్తి పైనే కాదు, సంస్థపైనే జరిగిన దాడి. విశ్వాసం వంటి సున్నితమైన అంశాలపై కూడా ఏ భిన్నాభిప్రాయం హింసను సమర్థించదు. ____ ఇటువంటి ప్రవర్తన ప్రజాస్వామ్య పునాదినే బెదిరిస్తుంది అని కేటీఆర్ తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో రాసుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు