తెలంగాణ, కామారెడ్డి. 7 అక్టోబర్ (హి.స.)
కామారెడ్డి లోని జిల్లా సమీకృత
కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ
సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాకవి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జ్యోతి ప్రజ్వలన చేసి వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మహర్షి వాల్మీకి ఆదికవి, ఆయన రచించిన రామాయణం నిత్యనూతన గ్రంథం. ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం మార్గం ప్రతి మనిషి జీవనానికి మార్గదర్శకం అని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు