మనసు మారితే మహానుభావులం కాగలం.. మెదక్ ఎస్పీ
తెలంగాణ, మెదక్. 7 అక్టోబర్ (హి.స.) మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్
మెదక్ ఎస్పి


తెలంగాణ, మెదక్. 7 అక్టోబర్ (హి.స.) మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు

సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి తొలుత దొంగగా జీవనం సాగించినప్పటికీ, తన గురువు బోధనల ద్వారా ప్రేరణ పొంది, పశ్చాత్తాపంతో సద్గుణ మార్గం వైపు మళ్లారు. ఆత్మశోధన ద్వారా మహానుభావుడిగా మారి, మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంథాన్ని రచించారని అన్నారు. మన మనసు మారితే ఎవరైనా మహానుభావులుగా ఎదగగలరని తెలిపారు. ఆయన చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande