తెలంగాణ, ములుగు. 7 అక్టోబర్ (హి.స.)
ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన మహా నాయకుడు కొమురం భీం వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసిందని అన్నారు. మా గుడాల్లో మా రాజ్యం కావాలని అడవుల మీద మాకు హక్కు ఉండాలని నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేశారు. జల్ జంగల్ జమీన్ పై పూర్తి అధికారం ఆదివాసులకు ఉండాలని పోరాటం చేశారని అన్నారు. కొమురం భీం పోరాటాల ఫలితంగానే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, తొలి ప్రధాని నెహ్రూ ఆదివాసీ గిరిజనులకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించారని వివరించారు. కొమురం భీం స్ఫూర్తితో ప్రత్యేక గిరిజన మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగిందని, రాజ్యాంగంలో ఈశాన్య రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కల్పించారనీ అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు