నాపై ఎందుకు విమర్శలు చేశారో తెలియదు.. అడ్లూరి వివాదంపై స్పందించిన మంత్రి వివేక్
హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.) '' నేను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు.. నేను పక్కన ఉంటే ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్.'' అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ స్పందించారు. అడ్లూరి నాపై ఎందుకు వి
మంత్రి వివేక్


హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)

' నేను పక్కన కూర్చుంటే మంత్రి వివేక్ లేచి వెళ్లిపోతున్నాడు.. నేను పక్కన ఉంటే ఓర్చుకోవడం లేదు. ఇది ఎంత వరకు కరెక్ట్.' అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ స్పందించారు. అడ్లూరి నాపై ఎందుకు విమర్శలు చేశారో తెలియడం లేదని అన్నారు. ఆయనపై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్తో మీటింగ్ ఉండటం వల్లే ఆరోజు మధ్యలో వెళ్లిపోవాల్సి వచ్చిందని మంత్రి వివేక్ వివరించారు. ఆ విషయం పక్కన ఉన్న మంత్రులకు కూడా చెప్పానని తెలిపారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ప్రస్తుతం తాను హైదరాబాద్లో లేనని.. వచ్చిన తర్వాత అన్నింటిపై మాట్లాడతానని చెప్పారు.

కాగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం టీపీసీసీని చేరింది. ఈ వివాదాన్ని వీలైనంత తొందరగా సద్దుమణిగేలా చేసేందుకు టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరు మంత్రులతో మహేశ్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు ఫోన్లో మాట్లాడారు. ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న మంత్రి అడ్లూరిని వెంటనే హైదరాబాద్ బయల్దేరి రావాలని కోరారు. ఇద్దరూ కలిసి పనిచేయాలని సూచించారు. ఇక ఈ వివాదంపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం పొన్నం, అడ్లూరితో మహేశ్ గౌడ్ భేటీ అవుతారని సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande