హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాడీ షేమింగ్ అంశం అధికార కాంగ్రెస్లో సెగలు పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే వివాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే తనతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడారని తెలిపారు. అక్కడితో ఆ వివాదానికి ఎండ్ కార్డు పడిందన్నాని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్లో మైనారిటీలకు సంబంధించిన కార్యక్రమంలో అసలు ఏం జరిగిందో పీసీసీ చీఫ్కు తాను పూర్తిగా వివరించానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పరంగా మాకు మహేశ్ గౌడ్ ఆదేశాలు శిరోధార్యమని పేర్కొన్నారు. మరోవైపు బాడీ షేమింగ్పై తనకు పొన్నం రేపటి వరకు క్షమాపణలు చెప్పకపోతే.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు