నంద్యాల, 7 అక్టోబర్ (హి.స.)
:ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న శ్రీశైలం క్షేత్ర పర్యటన ఖరారైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పర్యటించే ప్రదేశాలైన ఛత్రపతి శివాజి స్ఫూర్తి కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు. ఈరోజు (మంగళవారం) శివాజి రాజదర్బార్, శివాజి ధ్యానమందిరం ఏర్పాట్లను ఎంపీ బైరెడ్డి, శబరి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరిశీలించారు. అనంతరం మాధవ్ మాట్లాడుతూ.. సరళీకృత జీఎస్టీ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమానికి ఈనెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పాల్గొంటారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ