అమరావతి, 7 అక్టోబర్ (హి.స.)
ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు.. పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు.. మరోవైపు.. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా క్యూ లైన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.. హుక్కుం పేటలో సిరిమానుకు పసుపు కుంకాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.. పైడితల్లి అమ్మావారి సిరిమానోత్సవ సందర్భంగా నగరపాలక సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.. నగరపాలిక పరిధిలో బయో మరుగుదొడ్లు సిద్ధం చేశారు.. ఉత్సవాలు జరిగే వేదికలతో పాటు జాతరకు సంబంధించిన ప్రధాన కేంద్రాల వద్ద టాయిలెట్లను అందుబాటులో ఉంచారు అధికారులు.. పారిశుద్ధ్య పనులకు అదనంగా నియమించారు.. వీరంతా మూడు షిఫ్టుల్లో పనిచేయనున్నారు.. క్యూలైన్లలో భక్తుల కోసం ఎక్కడికక్కడ నీళ్లను అందిస్తున్నారు.. ఇక, పైడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా.. ఇవాళ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు అనువంశక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ