తాగునీటి కోసం నిరసన.. జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
నాగర్ కర్నూల్, 7 అక్టోబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన వారు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పై తాగునీటి కోసం నిరసన వ్యక్తం చేశారు. దసరా పండుగ ముందు నుండి గ్రామంలో తాగునీటి సమస్య ఉందన
నిరసన


నాగర్ కర్నూల్, 7 అక్టోబర్ (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్

మండలం మన్ననూర్ గ్రామంలో ప్రశాంత్ నగర్ కాలనీకి చెందిన వారు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి పై తాగునీటి కోసం నిరసన వ్యక్తం చేశారు. దసరా పండుగ ముందు నుండి గ్రామంలో తాగునీటి సమస్య ఉందని పంచాయతీ కార్యదర్శికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని నిరసన చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నిరసన చేస్తున్న మహిళలు, గ్రామస్తులను నచ్చజెప్పే ప్రయత్నం చేసి ఆందోళన విరమింపజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande