హైదరాబాద్, 7 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పార్టీ గుర్తింపు, ఎన్నికల గుర్తును చట్టప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశించింది. ఇటీవల తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు కల్పిస్తూ తమ రాజకీయ పార్టీ గుర్తింపు, ఎన్నికల గుర్తు కేటాయించాలని తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు పిటిషనర్ అబ్యర్ధనను చట్టప్రకారం పరిశీలించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. కాగా బీసీలే ఎజెండాగా తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మల్లన్న పార్టీకి ఎన్నికల గుర్తు విషయంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందో చూడాలి మరి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..