తెలంగాణ, 7 అక్టోబర్ (హి.స.)
. ముంపునకు గురయ్యే పలు ప్రాంతాల్లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని మల్లికార్జున్ నగర్ కాలనీలో రూ. 60 లక్షల వ్యయం తో చేపట్టిన వరద నీటి ప్రవాహం కొరకు శాశ్వత పరిష్కారం దిశగా డ్రైన్ బాక్స్ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజ కవర్గ పరిధిలో వరద నీటితో ముంపునకు గురయ్యే కాలనీలను గుర్తించనున్నట్లు చెప్పా రు. శాశ్వత పరిష్కారం దిశగా దశలవారీగా పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు