అంబేద్కర్ విగ్రహం నిప్పంటుకున్న ఘటనలో వైసిపి నేత సర్పంచ్.గోవిందయ్య అరెస్ట్
చిత్తూరు,7 అక్టోబర్ (హి.స.) ఏపీలో సంచలనం సృష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం మంటల అంటుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బొ
అంబేద్కర్ విగ్రహం నిప్పంటుకున్న ఘటనలో వైసిపి నేత  సర్పంచ్.గోవిందయ్య అరెస్ట్


చిత్తూరు,7 అక్టోబర్ (హి.స.)

ఏపీలో సంచలనం సృష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని వెదురుకుప్పం మండలం దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం మంటల అంటుకున్న ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో బొమ్మాయపల్లి సర్పంచ్ గోవిందయ్యను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుషార్ డూడే వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టక పోయినా పెట్టినట్లు ఘటనను సృష్టించి స్థానిక టీడీపీ నాయకులపై నెపం నిట్టే ప్రయత్నానికి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య ఒడిగట్టారు. ఈనెల మూడో తేదీన అర్ధరాత్రి ప్రమాదవశాత్తు విగ్రహానికి ఆనుకుని ఉన్న పూరిపాకకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande