తిరుమల , 7 అక్టోబర్ (హి.స.)కొన్ని నెలలుగా శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై మరోసారి టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి (Bhanuprakash Reddy) ఫైర్ అయ్యారు.
ఇవాళ ఆయన తిరుమల (Tirumala)లో మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా పూజలందుకుటున్న శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఉద్దేశపూర్వకంగా తప్పులు చూపడం సరైంది కాదని మండిపడ్డారు. వైసీపీ ప్రభత్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా లెక్కలేనన్ని పనులు చేశారని ఆరోపించారు. గతంలో రంగనాయకుల మండపంలో జరగాల్సిన పరివట్టం వెంకయ్య చౌదరి ఇంటి వద్ద ఎందుకు నిర్వహించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ హయాంలో స్వామి వారి శేష వస్త్రం ఎవరెవరికి చేరిందో.. ఎలా బయటకు వెళ్లిందో త్వరలోనే లెక్కలన్నీ బయటపడతాయని వార్నింగ్ భానుప్రకాశ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV