తిరుమల, 7 అక్టోబర్ (హి.స.) ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు.
ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 4 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక మంగళవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Que Complex)లోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు భక్తులతో కిక్కిరిపోయి.. క్యూలైన్ గంగమ్మ ఆలయం వరకు ఉంది. సోమవారం స్వామి వారిని 76,773 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 29,100 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామి వారి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV