అమరావతి, 7 అక్టోబర్ (హి.స.) ఇప్పటి వరకు మనీ లాండరింగ్, రియల్ ఎస్టేట్స్ రంగాల్లో మోసాలకు పాల్పడిన వారి ఇళ్లు, ఆఫీసులపై దాడులు చేసిన ఐటీ అధికారులు సడన్‌గా రూటు మార్చారు. తాజాగా ఇవాళ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఏక కాలంలో సోదాలు చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, తెలంగాణలోని మహబూబ్ నగర్ ప్రాంతంలో మొత్తం పది చోట్ల పప్పు దినుసుల హోల్‌సేల్ వ్యాపారుల నివాసాల్లో రెయిడ్స్ నిర్వహిస్తున్నారు. వారు చేస్తున్న వ్యాపారానికి రికార్డులలో చూపించే లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరకపోడాన్ని గమనించి ఐటీ అధికారులు ఈ మెరుపు సోదాలకు దిగినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV