ముంబై, 8 అక్టోబర్ (హి.స.)
బాంబే హైకోర్టు నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. రూ.60 కోట్ల మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈ రోజు బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాలకు శిల్పా శెట్టి దంపతులు వెళ్లాలనుకుంటే.. ముందుగా రూ.60 కోట్లు డిపాజిట్ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. శిల్ప శెట్టి దంపతులు తమపై నమోదైన మోసం కేసులో జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (LOC)ను రద్దు చేయమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణ సందర్భంగా ఈ తీర్పు వెలువడింది.
కేసు వివరాల ప్రకారం.. వ్యాపారవేత్త దీపక్ కొఠారి (60), శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులు తనతో కుదుర్చుకున్న లోన్-కమ్-ఇన్వెస్ట్మెంట్ ఒప్పందం పేరుతో దాదాపు రూ.60 కోట్ల మోసం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఆగస్టు 14న ముంబైలోని జుహు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు దశలో ఉండగా.. రూ.60 కోట్లు డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే, దంపతుల విదేశీ పర్యటన పిటిషన్పై తదుపరి విచారణ జరగనుందని కోర్టు తేల్చి చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు