body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.)ప్రభుత్వాధినేతగా ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2001 అక్టోబరు 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోనూ మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ‘‘భారతీయులు నిరంతరంగా అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. ప్రభుత్వాధినేతగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి దోహదపడటానికి ఇన్ని సంవత్సరాలుగా నిరంతరం కృషిచేస్తూనే ఉన్నాను. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అవినీతి, పక్షపాతానికి పర్యాయపదంగా ఉండేది. ప్రపంచ క్రమం(గ్లోబల్ ఆర్డర్)లో భారత్‌ను బలహీన పరిచింది. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతునిచ్చి భాజపాకు అధికారాన్ని కట్టబెట్టారు’’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్‌షా ప్రధాని మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీని ‘కర్మయోగి’గా అభివర్ణిస్తూ ఎక్స్‌లో పోస్టుపెట్టారు. 24 సంవత్సరాలు మోదీ నిస్వార్థంగా తన జీవితాన్ని దేశానికి, ప్రజాసేవకు అంకితం చేశారని, ప్రజల సమస్యలను తన సమస్యలుగా పరిగణించి ప
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ