హైదరాబాద్, 8 అక్టోబర్ (హి.స.)
ప్రయాణికులకు భారతీయ రైల్వే
గుడ్ న్యూస్ చెప్పింది. బుక్ చేసుకున్న టికెట్ల ప్రయాణ తేదీని మార్చుకునేలా కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి కొత్త విధానం అమల్లోకి రాబోతున్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇక నుంచి ప్రయాణికులు ఎలాంటి రుసుము లేకుండా ఆన్లైన్లో ప్రయాణికులు ప్రయాణ తేదీల్లో మార్పుల చేసుకొవచ్చు. అయితే, మార్చుకోవాల్సిన తేదీల్లో ఒకవేళ సీట్లు ఖాళీగా ఉంటేనే మార్పు సాధ్యమని, వ్యత్యాసాన్న ప్రయాణికుడు భారించాల్సి ఉంటుందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..