వేలిముద్రతోనూ యూపీఐ చెల్లింపులు నేటి నుంచి అందుబాటులోకి?
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;} ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.) యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే
UPI transaction


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}

ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.) యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) చెల్లింపులకు ఇప్పటివరకు పిన్‌ నమోదు చేస్తుండగా, ఇకపై వేలి ముద్ర, ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌)తోనూ లావాదేవీ పూర్తికానుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ఈ విధానాన్ని ఆవిష్కరించినట్లు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు వెల్లడించారు. ముంబయిలో జరుగుతున్న గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌ (జీఎఫ్‌ఎఫ్‌)లో దీన్ని మంగళవారం ప్రదర్శించారు. కొత్త సదుపాయం ఎప్పటినుంచి అందరికీ అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని నాగరాజు వెల్లడించలేదు. అయితే బుధవారం (ఈనెల 8) నుంచే కొత్త విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఆధార్‌ కార్డులో నమోదైన బయోమెట్రిక్‌ సమాచారాన్ని ఉపయోగించి ఈ వ్యవస్థ పనిచేయనుంది.

25% సమయం ఆదా

పిన్‌ నమోదు పద్ధతిలో ప్రస్తుతం జరుగుతున్న యూపీఐ లావాదేవీలతో పోలిస్తే, కొత్త విధానం వల్ల భద్రత మరింత పటిష్ఠం అవ్వడమే కాక, లావాదేవీ సమయం 25% వరకు తగ్గుతుందని చెబుతున్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా ఏదైనా కొనుగోలు చేస్తున్నప్పుడు, పిన్‌ నమోదు చేయకుండానే ముఖాన్ని స్కాన్‌ చేయడం లేదా వేలిముద్ర ఆధారంగా చెల్లింపు పూర్తిచేయొచ్చు. డిజిటల్‌ చెల్లింపుల వాడకంపై మరింత నమ్మకాన్ని ఈ విధానం గ్రామీణుల్లో కల్పిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande