బెంగళూరు, 8 అక్టోబర్ (హి.స.)భారత మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవేగౌడ(HD Deve Gowda) ఆసుపత్రిలో చేరారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధ పడుతున్న ఆయనను బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. పరిశీలించి.. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. దీంతో దేవేగౌడ కుటుంసభ్యులు, ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, దేశానికి దేవెగౌడ 11వ ప్రధానమంత్రిగా పనిచేశారు. యునైటెడ్ ఫ్రంట్ (United Front) ప్రభుత్వంలో భాగంగా ఆయన ప్రధాని అయ్యారు. దీనికి ముందు, ఆయన 1994 నుండి 1996 వరకు కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV