జైపూర్, 8 అక్టోబర్ (హి.స.)రాజస్థాన్‌లోని జైపూర్ సమీపంలో ఘోర ప్రమాదం (Fatal accident) జరిగింది. జైపూర్–అజ్మీర్ నేషనల్ హైవేపై దుడు ప్రాంతం వద్ద గ్యాస్ సిలిండర్లు తరలిస్తున్న ట్రక్కు (Gas cylinders truck)ను మరో లారీ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీ కొన్న వెంటనే ట్రక్కులో ఉన్న సిలిండర్లు బాంబుల్లా పేలిపోగా, మంటలు చెలరేగి రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద స్థలాన్ని చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది (Firefighters) మంటలను ఆర్పేందుకు భారీగా ప్రయత్నాలు జరిపారు.
ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. అలాగే గ్యాస్ సిలిండర్లు (Gas cylinders) పేలుడు ధాటికి ఎగిరి పడుతుండటంతో అనేక వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. అధికారులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా, ప్రాథమిక సమాచారం ప్రకారం గ్యాస్ సిలిండర్ల లీకేజీ కారణంగా మంటలు మరింత విస్తరించినట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రమాదంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబాలకు సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వీలైనంత ట్రాఫిక్ క్లియర్ చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV