సాయుధ దళాల మధ్య సమన్వయానికి ఆపరేషన్‌ సిందూర్ నిదర్శనం: ఐఏఎఫ్‌ చీఫ్‌
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;} ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.) భారతదేశ స్వదేశీ సామర్థ్యాలు, సాయుధ ద
IAFs Rafale fighter jets will be equipped with mid-air refueling technology


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}

ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.) భారతదేశ స్వదేశీ సామర్థ్యాలు, సాయుధ దళాల మధ్య ప్రభావవంతమైన సమన్వయానికి ఆపరేషన్‌ సిందూర్‌ ఒక ఉదాహరణ అని వాయుసేన అధిపతి ఏపీ సింగ్‌ (Air Chief Marshal AP Sing) పేర్కొన్నారు. 93వ వైమానిక దళ దినోత్సవంలో భాగంగా ఘజియాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.

ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)లో భాగంగా శత్రు భూభాగంపై కచ్చితమైన దాడులు చేసేందుకు స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆయుధాలు అద్భుతమైన పనితీరు కనబరిచాయన్నారు. స్వదేశీ ఆయుధాలు మన విశ్వాసాన్ని వమ్ముచేయలేదన్నారు. కచ్చితమైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, నిర్ణీత అమలుతో ఏం సాధించవచ్చనేది ఈ ఆపరేషన్‌లో చూపించామన్నారు. వైమానిక దళాన్ని సమర్థమంతంగా ఎలా ఉపయోగించుకోవచ్చో ప్రపంచానికి చాటిచెప్పామన్నారు. 1948, 1971, 1999తో పాటు బాల్‌కోట్‌లో ఉగ్రవాదుల విధ్వంసం, ఆపరేషన్‌ సిందూర్‌లలో భారత వైమానిక యోధులు తమ పరాక్రమంతో చరిత్ర సృష్టించారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande