రూ.24వేల కోట్లతో నాలుగు రైల్వే ప్రాజెక్టులు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;} ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.): మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత
railway


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}

ఢిల్లీ, 08 అక్టోబర్ (హి.స.): మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల పరిధిలో సుమారు 894 కి.మీ పొడవున 3వ, 4వ లైన్ల రైల్వే ట్రాకుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర క్యాబినెట్‌ కమిటీ రూ.24,634 కోట్ల వ్యయ అంచనాతో రూపొందించిన నాలుగు రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇవి పూర్తయితే ప్రజారవాణాతో పాటు సరకుల రవాణా మరింత సౌలభ్యంగా మారుతుందని, వివిధ ప్రాంతాలతో నిరాటంకమైన అనుసంధానత పెరుగుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

మహారాష్ట్రలోని వార్దా-భుసావల్‌ మధ్య 314 కి.మీ పొడవున 3వ, 4వ లైన్ల రైల్వే ట్రాకుల నిర్మాణం

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ల పరిధిలో గోందియా-డోంగర్‌గఢ్‌ మధ్య 84కి.మీ పొడవైన 4వ లైన్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణం

గుజరాత్, మధ్యప్రదేశ్‌ల పరిధిలో వడోదరా-రత్లామ్‌ మధ్య 259 కి.మీ పొడవైన 3వ, 4వ లైన్ల రైల్వే ట్రాకు నిర్మాణం

మధ్యప్రదేశ్‌లో ఇటార్సీ-భోపాల్‌-బీనా మధ్య 84 కి.మీ. పొడవైన 4వ లైన్‌ రైల్వే ట్రాకు నిర్మాణం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande