body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}
ముంబై,07,అక్టోబర్ (హి.స.) దేశీయ సూచీలు నాలుగో రోజూ లాభాలు ఆర్జించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ బ్యాంక్ షేర్లకు దేశీయ సంస్థాగత మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ 3 పైసలు తగ్గి 88.77 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 0.15% తగ్గి 65.37 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో జపాన్ సానుకూలంగా ముగిసింది. చైనా, దక్షిణ కొరియా మార్కెట్లకు సెలవు. ఐరోపా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి.
బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.39,000 కోట్లు పెరిగి, రూ.460.23 లక్షల కోట్ల (5.19 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది.
సెన్సెక్స్ ఉదయం 81,883.95 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,790.12) సానుకూలంగా ప్రారంభమైంది. 81,787.48 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని, 82,309.56 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని సూచీ నమోదు చేసింది. చివరకు 136.63 పాయింట్ల లాభంతో 81,926.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 సైతం 30.65 పాయింట్లు పెరిగి 25,108.30 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 25220.90-25,076.30 పాయింట్ల మధ్య కదలాడింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ