చెన్నై, 8 అక్టోబర్ (హి.స.)
తమిళ హీరో, టీవీకే అధినేత విజయ్ వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలను పరామర్శించారు. కాగా ఇప్పుడు ఆ కుటుంబాలను కలుసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. డీజీపీకి పంపిన మెయిల్‌లో విజయ్ తొక్కిసలాటలో మరణించినవారి కుటుంబాలను కలుసుకోవాలని, వారికి స్వయంగా సంతాపం తెలపాలని అనుకుంటున్నట్టు విజయ్ పేర్కొన్నారు.
దీంతో పోలీసులు ఆయనకు పర్మిషన్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనకు విజయ్ ఆలస్యంగా రావడమే కారణం అని ఇప్పటికే పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పర్మిషన్ ఇవ్వకపోవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే విజయ్ నిర్వహించిన కరూర్ సభలో 41 మంది మరణించగా, 61 మంది గాయపడ్డారు. ఘటనకు ప్రభుత్వమే కారణం అని విజయ్ ఆరోపిస్తుండగా, విజయ్ ఆలస్యంగా రావడమే కారణం అని స్టాలిన్ ప్రభుత్వం మండిపడుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV