
పాట్నా, 11 నవంబర్ (హి.స.)
బీహార్ శాసనసభ ఎన్నికల ఆఖరి విడత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ విడతలో 20 జిల్లాల పరిధిలోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 45 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1302 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలోని 12 మంది మంత్రులు కూడా పోటీలో ఉన్నారు.
ఎన్డీయే కూటమిలోని చిన్న పార్టీ అయిన హిందూస్థానీ అవామీ పోటీ చేస్తున్న 6 స్థానాలు ఈ ఆఖరి విడతలోనే ఉన్నాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..