ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-fa
Blast


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.cf4{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 11 నవంబర్ (హి.స) పేలుళ్లకేసులో ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న డా.ఉమర్ మహమ్మద్(Umar Mohammad) ముఖచిత్రం బయటపడింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట(Red Fort) సమీపంలో పేలిన వైట్ హ్యుండాయ్ ఐ20(Hundai I20) కారు ఉమర్‌కు చెందినదిగా పోలీసులు తేల్చారు. ఈ దుర్ఘటనలో 9 మంది మరణించగా, 20 మంది క్షతగాత్రులయ్యారు. దీనిని ఆత్మాహుతి బాంబర్‌గా అనుమానిస్తున్న పోలీసులు.. అతడి ముఖాన్ని యాక్సెస్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి జమ్ము కశ్మీర్ అతడి తల్లి, సోదరులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది.

ఉమర్ 1989 ఫిబ్రవరి 24న జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో జన్మించాడు. ఇతడు ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ మెడికల్ కాలేజీ(Al-Falah Medical College)లో వైద్యునిగా పనిచేస్తున్నాడు. జమ్ము కశ్మీర్, హరియాణా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 'వైట్ కాలర్' టెర్రర్ మాడ్యూల్‌లో సోమవారం అరెస్టైన ఇద్దరు వైద్యులు అదిల్ అహ్మద్ రాథర్, ముజామ్మిల్ షకీల్‌లతో ఇతడికి సాన్నిహిత్యం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కొన్ని రోజులుగా మాడ్యూల్‌లో ఉన్న ఆ ఇద్దరు కీలక సభ్యులను అరెస్ట్ చేసిన దర్యాప్తు బృందం.. వారి నుంచి సుమారు 2,900 కిలోల అనుమానిత పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. విషయం తెలుసుకున్న ఉమర్.. ఫరీదాబాద్ నుంచి పరారయ్యాడు. అతడు భయాలోందనకు గురై ఇలా ఆత్మాహుతి బాంబుదాడికి పాల్పడినట్టు సమాచారం. ఈ దాడి చేసేందుకు ఉమర్, అతడి సన్నిహితులు అమ్మోనియం నైట్రేట్ ఇంధన ఆయిన్(ANFO)ను వినియోగించారు. కారులో డిటోనేటర్‌ను ఉంచి లాల్‌ఖిలా సమీపంలో రద్దీగా ఉండే ప్రదేశంలో ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande