సహాయక చర్యలకు భారత్ సిద్ధం.. నేపాల్ వరదలపై ప్రధాని మోదీ
సహాయక చర్యలకు భారత్ సిద్ధం.. నేపాల్ వరదలపై ప్రధాని మోదీ
Pm


న్యూఢిల్లీ, 26 ఆగస్టు (హి.స.)

నేపాల్లో వరదల కారణంగా ప్రాణనష్టం సంభవించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో ఫోన్లో మాట్లాడిన మోదీ.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. నేపాలు అవసరమైన అన్ని రకాల మానవతా సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక, రక్షణ చర్యలపై ఇరు దేశాల బృందాలు సన్నిహితంగా సమన్వయం చేసుకుంటున్నాయని మోదీ వెల్లడించారు. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande