ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు..
హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.) భారత సినీ రంగానికి మరో గర్వకారణం. ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రదానం చేసే అత్యున్నత సత్కారం ''చెవాలియర్'' (Chevalier Award) కు ఆయనను ఎంపిక చేసింది.
తోట తరణి


హైదరాబాద్, 12 నవంబర్ (హి.స.)

భారత సినీ రంగానికి మరో గర్వకారణం. ప్రఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ తోట తరణికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రదానం చేసే అత్యున్నత సత్కారం 'చెవాలియర్' (Chevalier Award) కు ఆయనను ఎంపిక చేసింది. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్ కార్యాలయంలో రేపు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఆయనకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తోట తరణికి అభినందనలు తెలిపారు.

గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో అద్భుతమైన సెట్ డిజైన్లతో మాయ చూపించారు. 'నాయకుడు', 'ఇంద్ర', 'దసరథి', 'జనతా గ్యారేజ్', 'తలపతి' వంటి సినిమాల్లో ఆయన సృష్టించిన సెట్లు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి తోట తరణి గారు,” అని స్టాలిన్ పేర్కొన్నారు. ఇక ఆయనకు ఇప్పటికే మూడు నేషనల్ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు లభించాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో 'చెవాలియర్' అవార్డు పొందడం ఆయన కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. సినీ, కళా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఈ గౌరవం అందజేస్తున్నట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande